‘చలో కాళేశ్వరం – దేఖో మేడిగడ్డ’
కాళేశ్వరంపై కాంగ్రెస్‌కు కనువిప్పు కలగాలి దాస్యం వినయ్ భాస్కర్ కేసీఆర్ నిర్మించిన కల్పతరువు మేడిగడ్డ.. కూలిందన్నది పచ్చి అబద్ధం వరంగల్ వాయిస్, మేడిగడ్డ (కాళేశ్వరం): తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ‘చలో కాళేశ్వరం - దేఖో మేడిగడ్డ’ పిలుపులో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రాజెక్టును సందర్శించారు....