WarangalVoice
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 1:38 pm Digital Edition : Ravi Goli

చిన్నారిని ఆశీర్వదించిన రాజకీయ నాయకులు

వరంగల్ వాయిస్, దామెర : దామెర గ్రామ పంచాయతీ కారోబార్ మాదాపూర్ బొబ్బిలి-అరుణ దంపతుల కుమార్తెల శారీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి, బీజేపీ దామెర మండల అధ్యక్షుడు వేల్పుల రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చిన్నారులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు మాజీ వార్డు సభ్యులు పొతుల వీరన్న, వంగ రవి, మెరుగు శివ కుమార్, మెరుగు సంపత్, ఇతర గ్రామానికి చెందిన ప్రముఖులు పాల్గొని వేడుకలో భాగస్వాములయ్యారు. కార్యకర్తలు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై బొబ్బిలి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.