చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలి
ఉప ముఖ్యమంత్రికి టీపీసీసీ నేత చిప్ప వెంకటేశ్వర్లు వినతి వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత ఆధ్వర్యంలోని చేనేత ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సూచనలతో డిప్యూటీ సీఎంకు వరంగల్ చేనేత కార్పెట్‌ను బహూకరించి, చేనేత కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చేనేత ఉత్పత్తులకు 30% కూలీ రేట్లు...