వరంగల్ వాయిస్, కమలాపూర్ : మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో 16వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేదికగా నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పద్మశాలీ మహిళా సర్పంచులను ఘనంగా సన్మానించారు. కమలాపూర్, మర్రిపెల్లిగూడెం, గోపాలపూర్ చేనేత సహకార సంఘాల నూతన అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, దేశరాజ్‌పల్లి సర్పంచ్ మిట్టపల్లి మహేశ్వరి, గూనిపర్తి సర్పంచ్ బుర్ర రాధిక, కమలాపూర్ 7వ వార్డు సభ్యురాలు తుమ్మ స్వాతిలను ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు, పరపతి సంఘం ప్రతినిధులు వారికి చేనేత కండువాలు కప్పి అభినందించారు. భవిష్యత్తులో రాజకీయ రంగంలో పద్మశాలీలు మరింతగా రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా బొప్ప శివశంకర్..
కమలాపూర్ పద్మశాలి పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొప్ప శివశంకర్, ఉపాధ్యక్షులుగా మెండు రమేష్ లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకు పద్మశాలి కులస్తులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి రవీందర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యం రాజగోపాల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పులికంటి రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరపతి సంఘం అధ్యక్షులు పోరండ్ల కుమారస్వామి, బైరి సహదేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, పరపతి సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.