చేనేత సంఘాల అధ్యక్షులు, మహిళా సర్పంచులకు సన్మానం
వరంగల్ వాయిస్, కమలాపూర్ : మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో 16వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేదికగా నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పద్మశాలీ మహిళా సర్పంచులను ఘనంగా సన్మానించారు. కమలాపూర్, మర్రిపెల్లిగూడెం, గోపాలపూర్ చేనేత సహకార సంఘాల నూతన అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, దేశరాజ్‌పల్లి సర్పంచ్ మిట్టపల్లి మహేశ్వరి, గూనిపర్తి సర్పంచ్ బుర్ర రాధిక, కమలాపూర్ 7వ వార్డు సభ్యురాలు తుమ్మ స్వాతిలను ఈ సందర్భంగా తెలంగాణ...