జర్నలిస్టు కృష్ణమూర్తికి తాటికొండ రాజయ్య పరామర్శ

అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, బీసీ రాజ్యాధికార సమితి జనగామ జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయమై సోమవారం మధ్యాహ్నం మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జర్నలిస్టు కృష్ణమూర్తి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు....