జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని ఊరుగొండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌లోని మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ భయంకర ప్రమాదంలో లారీ డ్రైవర్ లారీ క్యాబిన్‌లోనే నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపూర్ మండలం రుక్కన్నపల్లి గ్రామానికి చెందిన నక్క బాలయ్య...