జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డా.గడ్డం వెంకన్నకు ప్రొఫెసర్ గా పదోన్నతి

వరంగల్ వాయిస్, వరంగల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న జానపద విజ్ఞాన అధ్యయనంలో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ బాచుపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ఉత్తర్వులు అందజేసి వెంకన్నను అభినందించారు.​డాక్టర్ గడ్డం వెంకన్న గత 30 ఏళ్లుగా జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతడికి...