జిల్లా స్థాయిలో డిస్నీల్యాండ్ విద్యార్థుల ప్రతిభ
వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 26, 2026న హనుమకొండలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో పూర్వపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిస్నీల్యాండ్ హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు కైవసం చేసుకున్నారు. 10వ తరగతి విద్యార్థి ఉప్పుల శ్రీచరణ్ చిత్రలేఖన పోటీలలో పూర్వపు వరంగల్ జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించగా, 8వ తరగతి విద్యార్థిని దయ్యాల లక్ష్మీప్రియ వ్యాసరచన పోటీలలో కన్సోలేషన్ బహుమతి అందుకుంది. విజేతలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మరియు...