WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 5:08 pm Digital Edition : Ravi Goli

జి వి ఎస్ ఆర్ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వరంగల్ వాయిస్,హనుమకొండ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండవ డివిజన్ గుండ్ల సింగారం జీవీఎస్ ఆర్ కాలనీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను కాలనీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా జీవీఎస్ ఆర్ కాలనీ అధ్యక్షుడు కుక్కల రాజు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలు త్యాగాలతో అలాగే విరోచిత పోరాటాల ద్వారా స్వతంత్రాన్ని సంపాదించుకొని మన దేశం విభిన్న మతాలకు ఒక వేదిక ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ప్రత్యేకతగా గుర్తింపు తెచ్చుకుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ తాజా కార్పొరేటర్ రవి నాయక్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పుట్ట తిరుపతి, మాజీ హనుమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి అజయ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజయ్య, సిసి రోడ్ కాంట్రాక్టర్ నాగేశ్వరరావు, కాలనీ అధ్యక్షుడు కుక్కల రాజు, కోశాధికారి యాకయ్య, కమిటీ సభ్యులు కొమురయ్య, పరమాత్మ, కుక్కమూడి వంశీ, మోహన్, రమేష్,మల్లయ్య, కాలనీ మహిళలు పాల్గొన్నారు.