టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి
కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు భారీ మెజారిటీతో విజయం వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికల్లో నూతన అధ్యక్ష, కార్యదర్శులు భారీ మెజార్టీతో గెలుపొందారు. జిల్లా అధ్యక్షుడిగా గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శిగా ఊటుకూరి సీతారామారావు (సాయి) భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. కోశాధికారితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ అధికారికంగా ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు జరిగిన...