టెక్నో సెన్స్ హై స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

వరంగల్ వాయిస్,హనుమకొండ: రెడ్డీపురం లోని టెక్నో సెన్స్ హై స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం స్కూల్ ప్రిన్సిపాల్ రాజమల్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా చిన్నారులు గోపిక కృష్ణుడు వేషాదారులలో అందరిని ఆట పాటలతో అలరించారు.అనంతరం పాఠశాల ఆవరణలో చిన్నారులతో ఉట్టి కొట్టించారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.