వరంగల్ వాయిస్, దామెర : హైదరాబాద్‌కు చెందిన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో, ఆ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విష్ణు సమక్షంలో డిస్నీల్యాండ్ హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారిని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఈ కార్యక్రమం దోహదపడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు, పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధానం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, వివిధ కెరీర్ మార్గాలు, లక్ష్య నిర్ధారణ, సమయ నిర్వహణ జీవితంలో విజయం సాధించే మార్గాలపై విలువైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు చేసిన ప్రేరణాత్మక ప్రసంగం విద్యార్థుల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా కఠిన శ్రమ, పట్టుదలతో ముందుకు సాగాలనే స్ఫూర్తిని నింపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఇటువంటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని డిస్నీల్యాండ్ హైస్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఈ విలువైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విష్ణు ఐఏఎస్ అకాడమీకి, ముఖ్యంగా ఎండీ శ్రీ విష్ణు గారికి పాఠశాల యాజమాన్య సభ్యులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీ నివాసం, శోభారాణి, రాకేష్ భాను, దినేష్ చందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.