డిస్నీల్యాండ్ హైస్కూల్‌లో ఘనంగా కెరీర్ గైడెన్స్
వరంగల్ వాయిస్, దామెర : హైదరాబాద్‌కు చెందిన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో, ఆ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విష్ణు సమక్షంలో డిస్నీల్యాండ్ హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ, వారిని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేర్చేలా ఈ కార్యక్రమం దోహదపడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉన్నత విద్యలో రాణించే అవకాశాలు, పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధానం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, వివిధ కెరీర్ మార్గాలు, లక్ష్య నిర్ధారణ,...