తక్కళ్లపాడులో చలివేంద్రం ప్రారంభం

వరంగల్ వాయిస్, దామెర: మండల పరిధిలోని తక్కళ్లపాడు గ్రామంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రముఖ జానపద గాయకుడు వరంగల్ శీను మంగళవారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ దాడి వసంత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ శీను మాట్లాడుతూ.. వేసవిలో బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప...