తాళం వేసిన ఇల్లే టార్గెట్‌గా భారీ చోరీ
తులంన్నర బంగారం అపహరణ! వరంగల్ వాయిస్, దామెర : మండల కేంద్రమైన దామెర గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడు హింగే రవీందర్ కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని తులంన్నర (15 గ్రాముల) బంగారు నల్లపూసల తాడును అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెర గ్రామానికి చెందిన హింగే రవీందర్ (42) ఈ నెల 17న తన ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలిసి శిరిడీ యాత్రకు వెళ్లారు....