తీవ్ర నష్టాల్లో రైస్ మిల్లులు.. ప్రభుత్వమే ఆదుకోవాలి
మిల్లర్ బూరుగుల రామచంద్రరావు వరంగల్ వాయిస్, దామెర : "గత రెండు మూడు సంవత్సరాలుగా ఐకేపీ కేంద్రాల ద్వారా వచ్చే ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియల వల్ల రైస్ మిల్లర్లు విపరీతంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే మిల్లులు మూతపడటం ఖాయం" అని దామెర మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి రైస్ మిల్ అధినేత బూరుగుల రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రైస్ మిల్లుల ప్రస్తుత దయనీయ...