తెలంగాణ సంస్కృతీకి ‘బతుకమ్మ’ ప్రతీక

  భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర నూర్జహాన్‌పల్లిలో బతుకమ్మ విగ్రహావిష్కరణ వరంగల్ వాయిస్, శాయంపేట : తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు ప్రతీక అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కొనియాడారు. శనివారం శాయంపేట మండలం నూర్జహాన్‌పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో 'సద్దుల బతుకమ్మ', 'దసరా' వేడుకలకు ప్రత్యేక విశిష్టత...