దళారీ దందా..

పత్తి కొనుగోళ్ల మారెబేరం.. మొక్కుబడి ధరతో రైతన్నకు మొదటికే మోసం.. కమీషన్ పేరా మరింత కోత.. చేండ్ల కాడిపత్తి చెండ్లకాన్నే మాయం.. అక్కరకు అమ్ముకుంటూ ఆగమవుతున్న అన్నదాత.. వరంగల్ వాయిస్, దామెర : దొరికిందే సందని, ఇదే అదను అని నొక్కుడూ ధ్యేయంగా తంతు సాగిస్తున్న వ్యాపారుల హవా ఇది. అమాయకత్వపు రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని, ఆర్థిక ఇబ్బందులను సాకుగా భావించి వ్యాపారాన్ని సాగిస్తూ పొట్టగొడుతున్న దళారుల దందా ఇది. పల్లెటూర్లలో పంట చేతికొచ్చి అమ్మకానికి సమయం లేకనో, ఖర్చులు భరిస్తూ కొద్దికొద్దిగా అమ్మడం...