దేశసేవకు యువత ముందు రావాలి
ఎయిర్ ఫోర్స్ శిక్షణ పూర్తి చేసిన ‘కావ్య’కు ఘన సన్మానం వరంగల్ వాయిస్, హనుమకొండ : దేశ రక్షణలో భాగస్వామ్యమై దేశసేవ చేసేందుకు యువత ఉత్సాహంగా ముందుకు రావాలని వెలుదండి వెంకట్రామయ్య పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెలుదండి దామోదర్ పిలుపునిచ్చారు. హనుమకొండ లోని న్యూ శాయంపేటకు చెందిన వెలుదండి శ్రీధర్ - పద్మ దంపతుల కుమార్తె వెలుదండి కావ్య వైమానిక దళం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆమెకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు...