దోమల బెడద నుంచి రక్షించాలి

వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని దోమల బెడద నుంచి రక్షించాలని జాతీయ బీసీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి పవన్ కోరారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ నగరంలోని అన్ని కాలనీలలో దోమలు రాకుండా ఫాగ్గింగ్ లాంటివి చేయాలని మునిసిపల్ కమిషనర్ ని కోరారు. దోమల వలన డెంగ్యూ, ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాబట్టి, మున్సిపల్ కమీషనర్ వెంటనే చొరవ తీసుకొని ఫాగ్గింగ్ లాంటివి రెగ్యులర్ గా చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.