వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ప్రముఖులు అయ్యగారు మాడుగుల నటరాజ్ శర్మ తీవ్ర అనారోగ్యంతో హనుమకొండలోని రోహిణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న ఆయన, నట్రాజ్ శర్మను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చికిత్స అందిస్తున్న సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నటరాజ్ శర్మ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆ భగవంతుడిని ఆకాంక్షిస్తూ, ఆందోళనలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ విజయచందర్ రెడ్డి ధైర్యాన్ని చెప్పారు.