నల్ల బ్యాడ్జీలతో పంచాయతీ కార్యదర్శుల నిరసన
వరంగల్ వాయిస్, దామెర: తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు దామెర మండలంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుమ్మడి కల్పన గారికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రెండవ పీఆర్సీ నివేదికను వెంటనే...