నిబంధనల పాటిస్తేనే భద్రత

ఎస్సై దూదిమెట్ల నరేష్ యాదవ్ వరంగల్ వాయిస్, రఘునాథ్‌పల్లి : రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా వాహనదారుల్లో మార్పు రావాలని రఘునాథ్‌పల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) దూదిమెట్ల నరేష్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బొల్లం ఉమారాణి అధ్యక్షతన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రయాణాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కుటుంబాలకు తీరని లోటును...