నిమ్స్‌లో అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిమ్స్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలు తెలంగాణ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. వేడుకల్లో భాగంగా నిమ్స్ మహిళా ఉద్యోగులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా రంగురంగుల పూలతో బతుకమ్మలను అమర్చి, ఆటపాటలతో సందడి చేశారు. పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. నిమ్స్ ప్రాంగణమంతా...