నూతన ఎస్సై, సీఐలకు సన్మానం

వరంగల్ వాయిస్, దామెర : దామెర పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు, అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరకాల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డిలను పలువురు సంఘాల నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో వారిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ సెక్రటరీ సొప్పరి రాజేష్, జిల్లా పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ దుబాసి రమేష్, ఊరుగొండ సొసైటీ మత్స్యశాఖ వైస్ చైర్మన్...