WarangalVoice
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 4:48 pm Digital Edition : Ravi Goli

నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరం

వరంగల్ వాయిస్,శాయంపేట: గ్రామాల్లో నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని శాయంపేట సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై జక్కుల పరమేష్ తెలిపారు. నర్సింహులపల్లి గ్రామంలో సోలార్ సీసీ కెమెరాల డెమోన్బ్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు రాజు, శ్రీకాంత్, కృష్ణ, లత, రజిత,రహీమున్నిసా, రజిత,సహ కారంతో రూ.25వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై పరమేష్ సమక్షంలో కెమెరాల పనితీరును ప్రదర్శించారు. భద్రతను బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు