WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 6:15 pm Digital Edition : Ravi Goli

న్యూ శాయంపేట లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ…

వరంగల్ వాయిస్, హనుమకొండ :80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 31వ డివిజన్‌లో తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మామిండ్ల రాజు మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు, వారి సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, ప్రజల సంక్షేమం కోసం మరింత బాధ్యతతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు.దేశభక్తి, ఐక్యత, సమానత్వం, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .