చిలుకమారి వెంకటేశ్వర్లు
పద్మశాలి సంఘం మాజీ కార్యదర్శికి పరామర్శ
కురవి మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం (టీపీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు ఆదివారం జిల్లా కమిటీ సభ్యులతో కలిసి పద్మశాలి సంఘం జిల్లా మాజీ కార్యదర్శి అల్వాల రామకృష్ణను పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన టీపీపీఎస్ నూతన కార్యవర్గ బృందం.. అల్వాల రామకృష్ణ కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీపీపీఎస్ జిల్లా బృందం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురవి శ్రీ వీరభద్ర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం పలికారు. మండల పద్మశాలీ సంఘం ఆమోదం మేరకు కురవి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కురవి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా మల్సూరు, ప్రధాన కార్యదర్శిగా చిన్నం భాస్కర్, కోశాధికారిగా మాదం మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. డోర్నకల్, గార్ల మండలాల నూతన కమిటీల ఎన్నికల ప్రక్రియకు సహకరించాల్సిందిగా మాదం శ్రీనివాస్, చిలుక నర్సనయ్యలను జిల్లా అధ్యక్షులు కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండల కేంద్రాల్లో పద్మశాలి భవన (కమ్యూనిటీ హాల్) నిర్మాణాల కోసం స్థల సేకరణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థల సేకరణ పూర్తయిన తర్వాత భవన నిర్మాణ ఫండ్ సేకరణ బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే కురవిలో పద్మశాలీల కోసం వసతి గృహ నిర్మాణం చేపట్టేలా ప్రత్యేక కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సామల నర్సయ్య, ఉపాధ్యక్షుడు మామిడాల శ్రీనివాస్, పోపా అధ్యక్షుడు కురుమ యోగేశ్వర్, పద్మశాలి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు అనుమాల సిద్ధార్ధ, మెతుకు భాస్కర్, వినోద్, సలహాదారుడు ఆది నారాయణ, పద్మశాలి సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.