పరకాల డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

వరంగల్ వాయిస్, పరకాల : జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) యూనియన్‌ను నమ్ముకున్న ప్రతి జర్నలిస్టు కష్టసుఖాల్లో అండగా ఉంటామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ వల్లాల రమణ స్పష్టం చేశారు. గురువారం పరకాల పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో నిర్వహించిన పరకాల డివిజన్ స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా ఐజేయూ చేపడుతున్న పోరాటాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ...