WarangalVoice
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 1:00 pm Digital Edition : Ravi Goli

పరకాల లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ వాయిస్, హనుమకొండ /పరకాల :హన్మకొండ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. రూ.82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.రూ.32.17 కోట్ల అంచనా వ్యయంతో దామెర మండలం ల్యాదేళ్లలో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు.రూ.10 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపేట గ్రామంలో అభివృద్ధి ప్రణాళిక పనులకు శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చెయ్యడంతో పాటు ఆత్మకూర్ లో టౌన్ షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కు శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో పరకాల పట్టణంలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన , రూ.1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయానికి శంకుస్థాపనలు చేశారు. పరకాలలో రూ.35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభించారు. ఆత్మకూర్ లో రూ.1 కోటితో నిర్మించిన అధునాతన ఎస్ పి ఎం సెంటర్ ప్రారంభం , పరకాలలో రూ.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.