పరకాల లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ వాయిస్, హనుమకొండ /పరకాల :హన్మకొండ జిల్లా పరకాలలో పలు అభివృద్ధి పనులను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. రూ.82 కోట్లతో పరకాల మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.65 కోట్లతో పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)...