పాదయాత్ర కాదు.. పొర్లుదండాలు యాత్ర చేసినా కేటీఆర్‌ను ఎవరూ నమ్మరు
వరంగల్ వాయిస్, హనుమకొండ : తెలంగాణలో తిరిగి పట్టు సాధించేందుకు కేటీఆర్ చేపడుతున్న ప్రయత్నాలపై కాంగ్రెస్ నాయకులు, మాజీ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివపటేల్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా, చివరకు పొర్లుదండాల యాత్ర చేసినా తెలంగాణ ప్రజలు ఆయనను పట్టించుకునే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్‌గా మార్చినా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని శివపటేల్ పేర్కొన్నారు. "పేరు ఏదైనా సరే, తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆ పార్టీకి శాశ్వతంగా వీఆర్ఎస్ ఇచ్చేశారు. కల్వకుంట్ల...