పిల్లల భవిష్యత్తు కోసమే భూమి ఉంచుకుంటా
వరంగల్ వాయిస్, శాయంపేట : తన పేరిట ఉన్న 35 గుంటల భూమిపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, తన పిల్లల భవిష్యత్తు కోసమే ఆ భూమిని ఉంచాలని భావిస్తున్నట్లు మైలారం గ్రామానికి చెందిన నాలిక కళ్యాణి తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ భూ వివాదంపై వివరాలను వెల్లడించారు. మైలారం గ్రామానికి చెందిన నాలిక కుమారస్వామితో తనకు వివాహం జరిగిందని, అనంతరం తాము హనుమకొండలో నివాసం ఉన్నామని కళ్యాణి తెలిపారు. భర్త తరచూ మద్యం సేవించి తనపై దాడి చేయడంతో పుట్టింటికి వెళ్లిపోయానని,...