పీహెచ్ సీ నిర్మాణానికి భూమి అప్పగింత
వరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య మందిరం భవన నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఆసుపత్రి భవన నిర్మాణానికి కేటాయించిన నాలుగు గుంటల భూమిని సోమవారం రెవెన్యూ అధికారుల సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అధికారికంగా అప్పగించారు. మండల కేంద్రంలో సుమారు నాలుగు గుంటల ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి, సరిహద్దులను గుర్తించిన అనంతరం ఈ ల్యాండ్ హ్యాండోవర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక్కడ నూతన ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే మండల పరిధిలోని...