పేకాట స్థావరంపై పోలీసుల దాడి

ఏడుగురు అరెస్ట్, నగదు స్వాధీనం వరంగల్ వాయిస్, దామెర: మండల పరిధిలోని ఊరుగొండ గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై దామెర పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 7,580ల నగదుతో పాటు, 6 సెల్ ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు దామెర సబ్ ఇన్స్పెక్టర్ కొంక అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా దామెర ఎస్ఐ కొంక అశోక్ మాట్లాడుతూ.. పేకాట వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సమాజానికి...