పేదల భూములను కాపాడటమే లక్ష్యం
జనగామలో భూదాన్ సదస్సు విజయవంతం వరంగల్ వాయిస్, జనగామ : స్థానిక కురుమ సంఘ భవనంలో తెలంగాణ సర్వోదయ మండల్ జనగామ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "భూదాన్ సదస్సు" ఘనంగా జరిగింది. బోలకొండ రవితేజ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూదాన్ భూముల రక్షణ, పంపిణీపై ముఖ్య అతిథులు కీలక ప్రసంగం చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యేలకంటి గిరి ప్రసాద్ మాట్లాడుతూ, ఆచార్య వినోబా బావే 1951 నుంచి 1965 వరకు 14 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి 46...