నేటి నుండి పేద ప్రజలకి విద్యా -వైద్యం అందేలా చూడటమే లక్ష్యం
వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని డబ్బాల ప్రాంతానికి చెందిన వినీష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో, మంచానికి పరిమిత పై ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు,తన భార్య, తన తల్లి ఆర్థిక ఇబ్బందుల కారణంగా బతుకు భారంగా మారడంతో, ఓ కధానమ్ ప్రసారం కాగా అది చూసిన దుగ్గింపుడి రంజిత్ రెడ్డి వెంటనే స్పందించి బుధవారం కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు..ఈ సందర్బంగా రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యా- వైద్య హక్కుల ప్రజా చైతన్య కార్యక్రమంని చిన్నారితో ప్రారంభించారు.ధనికులతో సమానంగా నేటి నుండి పేద ప్రజలకి విద్యా -వైద్యం అందేలా చూడటమే, ఈ చైతన్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని రంజిత్ రెడ్డి చిన్నారితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విద్య -వైద్య హక్కుల ప్రజా చైతన్య కార్యక్రమ మొదలుపెట్టారు.రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులు ఓటు కోసం వస్తే విద్యా వైద్యం సమానంగా అందిస్తేనే మా ఓటు వేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.