WarangalVoice
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 3:57 pm Digital Edition : Ravi Goli

పోపా జిల్లా అధ్యక్షుడిగా కూర్మ యోగేశ్వర్

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధ విభాగమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధర్యంలో పోపా జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పద్మశాలి కుల బాంధవుల సంక్షేమం, సంఘాభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో సభ్యులందరి ఏకాభిప్రాయంతో జిల్లా పోపా అధ్యక్షుడిగా కూర్మ యోగేశ్వర్ (రిటైర్డ్ ఎమ్మార్వో), యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అనుమాల సిద్ధార్థ్ లను ఏకగ్రీకంగా ఎన్నకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా మరియు సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొప్పెరి హరిహర కిషన్, కార్యదర్శి సోమ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు గౌరవ అధ్యక్షులు అనుమాల వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పన్నాల సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామల నరసయ్య, కోశాధికారి బొమ్మ వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు మామిడాల శ్రీనివాస్, మార్కండేయ గుడి అధ్యక్షులు కైరంకొండ వీరన్న, కూరపాటి ఆదినారాయణ, పెద్ద సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు.