పోపా జిల్లా అధ్యక్షుడిగా కూర్మ యోగేశ్వర్
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత పద్మశాలి సంఘం అనుబంధ విభాగమైన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధర్యంలో పోపా జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు చిలుకమారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పద్మశాలి కుల బాంధవుల సంక్షేమం, సంఘాభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో సభ్యులందరి ఏకాభిప్రాయంతో జిల్లా పోపా అధ్యక్షుడిగా కూర్మ యోగేశ్వర్ (రిటైర్డ్ ఎమ్మార్వో), యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అనుమాల...