వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఇటీవల ఎన్నికైన నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌ను సీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని మొక్కలను అందజేశారు.ఈ సందర్భంగా ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులను పోలీస్ కమిషనర్‌కు పరిచయం చేశారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా కె. కరుణాకర్, ఉపాధ్యక్షులుగా బి. సతీష్, బి. శరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఇ. వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శిగా టి. నరేష్, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎస్. ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా బి. నరేష్, కార్యనిర్వాహక సభ్యులుగా ఎం. తులసి, సి.హెచ్. మహేందర్ యాదవ్, ఏ. రమేష్, ఎన్. ప్రవీణ్, ఎం.డి. తాజుద్దీన్, పి. సర్వేశ్ ఉన్నారు.అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులకు ముందుగా అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంఘం సిబ్బందికి అండగా నిలుస్తూ, స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని సీపీ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నాగయ్య, సదయ్యతో పాటు నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.