ప్రతి బూత్ ఏజెంట్ సైనికుడిలా పనిచేయాలి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో బూత్ ఏజెంట్లు ఒక సైనికుడిలా పనిచేస్తూ, బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, 8వ డివిజన్ ఇన్‌చార్జి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒక్క అర్హమైన ఓటు కూడా మిస్ కాకుండా, అక్రమంగా తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు.. బుధవారం సాయంత్రం హన్మకొండ...