వరంగల్ వాయిస్, దామెర: దామెర మండల సమీక్షా, సమన్వయ సమావేశం ప్రత్యేక అధికారి ఆర్. లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి దామెర మండల స్థాయి అధికారులు హాజరై, తమ తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఆర్. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సర్పంచులు భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా వి.బి.జి. రామ్‌జీ పథకంపై ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని ఆమె కోరారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి, అమలు చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వివరాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గుమ్మడి కల్పన, పి ఆర్ ఏ ఈ సమ్మిరెడ్డి, విద్యుత్ ఏఈ గుర్రం రమేష్, హౌసింగ్ ఏఈ ఆకాంక్ష, సర్పంచులు దుబాసి నవీన్, దుబాసి శ్రీకాంత్, పెండ్లి రాజు, పంచగిరి రాజు, వడ్డేపల్లి చందు, దాడి వసంత రమేష్, గరిగే కల్పన తదితర గ్రామాల సర్పంచులు అధికారులు పాల్గొన్నారు