ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచులు భాగస్వాములు కావాలి

వరంగల్ వాయిస్, దామెర: దామెర మండల సమీక్షా, సమన్వయ సమావేశం ప్రత్యేక అధికారి ఆర్. లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి దామెర మండల స్థాయి అధికారులు హాజరై, తమ తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఆర్. లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సర్పంచులు భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా వి.బి.జి. రామ్‌జీ పథకంపై ప్రజలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం...