ప్రభుత్వ బడిలో చేరితే రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్
దమ్మన్నపేట సర్పంచ్ దుబాసి నవీన్ నిర్ణయం వరంగల్ వాయిస్, దామెర : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు దామెర మండలం దమ్మన్నపేట గ్రామ సర్పంచ్ నవీన్ ఒక అద్భుతమైన, వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరే ప్రతి విద్యార్థి పేరు మీద రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ...