ప్రాణాలకు శ్రీరామరక్ష.. రహదారి భద్రత
ఆత్మకూరు సీఐ సంతోష్ వరంగల్ వాయిస్, ఆత్మకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రహదారి భద్రత అవగాహన కార్యక్రమం రెండో రోజు ఆత్మకూరు మండలంలో మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు పెదాపూర్ గ్రామంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహాల వద్ద సీఐ సంతోష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, యువత కలిసి రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ప్రజల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట...