WarangalVoice
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 1:35 pm Digital Edition : Ravi Goli

ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం..

పుడమి తల్లిని కాపాడుకుందాం

సుజాత విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా ‘ధరిత్రీ దినోత్సవం’

వరంగల్ వాయిస్, హసన్ పర్తి: ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హసన్ పర్తిలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాస్కులు ధరించి, ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసిన హారాలను మెడలో వేసుకుని వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూమి ఏ విధంగా కలుషితమవుతుందో ప్లకార్డులు, బ్యానర్ల ద్వారా వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించి, భూతాపాన్ని తగ్గించాలని నినదించారు. ప్రిన్సిపాల్ శాంతారాం కర్ణ మాట్లాడుతూ.. ఎన్ని జన్మలెత్తినా నేలతల్లి రుణం తీర్చుకోలేమని, ఒక్క మొక్కను నాటి పుడమి తల్లి ఆయుష్షును పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞభూమాతను కాపాడడానికి, పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు జూపాక నాగరాజు, ఏ.వెంకట్, పి.వెంకటేశ్వర్లు, ఈ.ప్రవీణ్, వై.అరుణ, సీహెచ్.సంధ్య, సుచిత్ర, సరిత, సబిహా, ప్రవళిక, మౌనిక, జి.సంధ్య, లావణ్య, సుధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.