ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం..

పుడమి తల్లిని కాపాడుకుందాం సుజాత విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా ‘ధరిత్రీ దినోత్సవం’ వరంగల్ వాయిస్, హసన్ పర్తి: ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హసన్ పర్తిలోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాస్కులు ధరించి, ప్లాస్టిక్ సీసాలతో తయారు చేసిన హారాలను మెడలో వేసుకుని వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. ప్లాస్టిక్...