ప్లాస్టిక్ రక్కసిని తరిమికొట్టడమే లక్ష్యం
వరంగల్ వాయిస్, నడికూడ : భూమిని కాపాడుకోవడం అంటే ప్లాస్టిక్ రక్కసిని తరిమికొట్టడమే అని ముస్త్యాలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు చాటిచెప్పారు. ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ సందర్భంగా బుధవారం పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఒకటవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “ప్లాస్టిక్ నుండి భూమిని కాపాడుకుందాం” అనే ఇతివృత్తంతో చిన్నారి విద్యార్థులు చేసిన ప్రదర్శన చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ప్లాస్టిక్ వాడకం వల్ల భూమికి, మూగజీవాలకు, పర్యావరణానికి కలిగే హానిని చిన్నారులు అత్యంత సరళంగా, అందరికీ అర్థమయ్యేలా కళ్లకు...