బతుకమ్మ విగ్రహాల ప్రారంభోత్సవం

వరంగల్ వాయిస్, పర్వతగిరి : తెలంగాణ సంస్కృతికి ప్రతీకయిన బతుకమ్మ పండుగ సందర్భంగా అన్నారం గ్రామంలో తొలిరోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పండుగ వేడుకల శుభసందర్భాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ నిధులతో నూతనంగా నిర్మించిన బతుకమ్మ విగ్రహాలను గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉపసర్పంచ్ గొడుగు ఏకాంత, పంచాయతీ కార్యదర్శి నిమ్మల రాజులతో కలిసి శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ మాట్లాడుతూ.. గ్రామంలో బతుకమ్మ పండుగను మహిళలందరూ సంప్రదాయబద్ధంగా, సమైక్యతా...